Hero Vijay Antony Bhadrakali : విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి టీజ‌ర్ రిలీజ్

త‌న కెరీర్ లో ఇది 25వ చిత్రం

Vijay Antony : సినీ రంగంలో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ యాక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు విజ‌య్ ఆంటోనీ(Vijay Antony). త‌ను న‌టించిన భిక్ష‌గాడు చిత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్స్ సాధించింది. మ‌నోడు ఆ త‌ర్వాత ప‌లు సినిమాలలో న‌టించాడు. అవి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే ఆద‌ర‌ణ పొందాయి. తాజాగా త‌ను కీల‌క పాత్ర పోషించిన భ‌ద్ర‌కాళీ చిత్రం టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా త‌నదైన మార్క్ ను చూపించే ప్ర‌య‌త్నం చేశాడు విజ‌య్ ఆంటోనీ. త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ రావ‌డంతో చాలా జాగ్ర‌త్త‌గా పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు.

Vijay Antony Bhadrakali Movie Updates

సినిమాల ఎంపిక విష‌యంలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇక త‌న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే త‌ను హీరో మాత్ర‌మే అనుకుంటే పొర‌పాటు. ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, గేయ రచ‌యిత‌, సంగీత ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ కూడా. ఇన్ని పాత్ర‌లలో త‌ను జీవిస్తూ ముందుకు సాగుతున్నాడు విజ‌య్ ఆంటోనీ. కాగా తాజా చిత్రం భ‌ద్ర‌కాళికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ లుక్ కు బిగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఈ సినిమాను అరుణ్ ప్ర‌భు చిత్రాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక విడుద‌ల చేసిన టీజ‌ర్ కూడా కెవ్వు కేక అనిపించేలా ఉంది. పిల్లి కూడా ఒక రోజు పులి కాక త‌ప్ప‌దు. అబ‌ద్దం..అహంకారం ఏదో ఒక రోజు అంతం కావ‌డం ఖాయం అంటూ పేల్చిన డైలాగులు మ‌రింత ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో డిఫ‌రెంట్ గా క‌నిపించ బోతున్నాడు విజ‌య్ ఆంటోనీ. మొత్తంగా ఈ చిత్ర క‌థ రూ. 190 కోట్ల కుంభ‌కోణం చుట్టూ తిరుగ‌తుంద‌ని టాక్. విడుద‌ల‌య్యాక కానీ అస‌లు విష‌యం తెలియ‌దు. అంత దాకా వేచి ఉండాల్సిందే.

Also Read :  Popular Actress Kajol :రూ. 28.78 కోట్ల‌తో కాజోల్ ఆస్తి కొనుగోలు 

BhadrakaliCinemaUpdatesVijay AntonyViral
Comments (0)
Add Comment