Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన భర్త విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. తన స్నేహితులు, సన్నిహితుల మధ్య బుర్జ్ ఖలీఫా ముందు కేక్ కట్ చేసి… ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేసింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో స్టోరీస్ లో పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో పాటు విఘ్నేష్ శివన్ కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vignesh Shivan Birthday Celebrations
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్(Vignesh Shivan) కోసం బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్ ను గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా ‘మన్నంగట్టి 1960’ మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Sharwanand: తన కొత్త సినిమా దర్శకుడు పేరు ప్రకటించిన శర్వానంద్ !