Vidya Balan : దర్శకులకు కావాల్సిన నటుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోగా పేరు పొందారు. తను సినిమా తీశాడంటే అది పక్కాగా సక్సెస్ కావాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన భగవంత్ కేసరి సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సమయంలో బోయపాటి శ్రీను(Boyapati Srinu) తీసిన అఖండ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ తీస్తున్నాడు దర్శకుడు . దీనికి మంచి క్యాప్షన్ కూడా పెట్టాడు డైరెక్టర్. అఖండ 2 తాండవం అని . ఇప్పటికే సన్నివేశాలు మరింత బలంగా ఉన్నాయి.
Vidya Balan in Director Boyapati Movie
సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా డైనమిక్ డైరెక్టర్ బాబ్జీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ లో నటించాడు బాలకృష్ణ. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కాగా, విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
పూర్తిగా డిఫరెంట్ జానర్ తో తీసే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న విద్యా బాలన్(Vidya Balan) అఖండ సీక్వెల్ లో నటిస్తుందని వినికిడి. ఇందులో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రలో తను నటించనుందని, ఈ మేరకు ఓకే కూడా చెప్పినట్లు చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా గతంలో బాలయ్యతో పాటు విద్యా బాలన్ నటించింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయో పిక్ లో కీ రోల్ పోషించింది. ఇక అఖండలో అఘోరీ పాత్రలో నటిస్తున్నట్లు టాక్.
Also Read : Mad Square 2 Sensational :ఓవర్సీస్ లోనూ కుర్రాళ్లు దుమ్ము రేపారు