Viduthalai 2 : డైరెక్టర్ వెట్రిమారన్ ‘విడుదలై-2’ డబ్బింగ్ మొదలు…పార్ట్ 3 పై ఆలోచన

డైరెక్టర్ వెట్రిమారన్ 'విడుదలై-2' డబ్బింగ్ మొదలు...పార్ట్ 3 పై ఆలోచన..

Viduthalai 2 : జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విడుదలై’-2’ చిత్రీకరణ పూర్తి చేసుకుని, డబ్బింగ్‌ ప్రారంభించింది. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబరు 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తొలిభాగం గత యేడాది మార్చి 31న విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఫస్ట్‌పార్ట్‌లో హీరో సూరి, లీడింగ్‌ రోల్‌ పోషించిన విజయ్‌ సేతుపతికి సంబంధించిన పాత్రలే కీలకంగా ఉన్నాయి. రెండో భాగంగా విజయ్‌ సేతుపతికి సంబంధించిన సన్నివేశాలతో కిషోర్‌, మంజు వారియర్‌, కెన్‌ కరుణాస్‌ వంటి ముఖ్య నటులకు సంబంధించిన పాత్రలున్నాయి.

Viduthalai 2 Movie Updates

ఈ నేపథ్యంలో ఈ చిత్రం డబ్బింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభించగా, ఇందులో దర్శకుడు వెట్రిమారన్, సూరి, విజయ్‌ సేతుపతి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదిలాఉంటే, రెండో భాగం కోసం చిత్రీకరించిన రషెస్‌ నిడివి అధికంగా ఉండటంతో మరో భాగం (థర్డ్‌ పార్ట్‌)గా విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలున్నట్టు సమాచారం. అయితే, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : Matka Movie : నెట్టింట దూసుకుపోతున్న జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘లే లే రాజా’ సాంగ్

TrendingUpdatesViduthalai-2Viral
Comments (0)
Add Comment