తమిళ సినీ యాక్టర్ అజిత్ కుమార్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయనకు జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోంది. విదా ముయార్చీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మగిజ్ తిరుమేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కథ కూడా తనే సమకూర్చారు. ఇక మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం.
సుభాస్కరన్ అల్లి రాజా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమిళంలో ప్రధానంగా తీస్తున్నండగా దీనిని లైకా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఇదిలా ఉండగా మొదట ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి ఆయనను మార్చారు. అతడి స్థానంలో మగిజ్ తిరుమేని వచ్చారు.
మొదట అజిత్ కుమార్ తో నయన తారను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరక పోవడంతో తార స్థానంలో త్రిష వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో కొనసాగుతోంది. అజిత్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు.