Victory Venkatesh Movie : స‌క్సెస్ క్రెడిట్ ప్రేక్ష‌క దేవుళ్ల‌దే

సంక్రాంతికి వ‌స్తున్నాం బృందం

Victory Venkatesh : దిల్ రాజు, శిరీస్ సంయుక్త నిర్మాణంలో సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా విడుద‌లైన సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వ‌రుస సినిమాల‌తో హ్యాట్రిక్ సాధించాడు మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి. క‌డుపుబ్బా న‌వ్వించ‌డం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండున్న‌ర గంట‌ల పాటు సినిమా ఉండేలా తీయ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌.

Victory Venkatesh Sankranthiki Vasthunnam Movie…

ఇక వ‌య‌సు మీద ప‌డుతున్నా ఎక్క‌డా ఆగ‌కుండా అన్ స్టాప‌బుల్ గా దూసుకు పోతున్నాడు విక్ట‌రీ వెంక‌టేశ్(Victory Venkatesh). ఇక ఆయ‌న‌తో పాటు పోటీ ప‌డి న‌టించారు భార్య‌గా ఐశ్వ‌ర్య రాజేశ్, మాజీ ల‌వ‌ర్ గా మీనాక్షి చౌద‌రి. ఇక శ్రీ వేంక‌టేశ్వ‌ర ప‌తాకం సినీ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన సంక్రాంతికి వ‌స్తున్నాం ఊహించ‌ని దానికంటే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. బాక్సులు నిండి పోయాయి. ఈ సినిమా స‌క్సెస్ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఓ టానిక్ లా ప‌ని చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు మూవీ మేక‌ర్స్. సంక్రాంతికి వ‌స్తున్నాం అన్ని రికార్డుల‌ను తిర‌గ రాసింద‌ని, ప్ర‌స్తుతం రూ. 235 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌ని ప్ర‌క‌టించారు. ఇక విక్ట‌రీ వెంక‌టేశ్ సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా ప‌లు చోట్ల స‌క్సెస్ మీట్స్ నిర్వ‌హిస్తూ వ‌స్తోంది బృందం. తాము న‌టించామ‌ని, కానీ ఆద‌రించిన ప్రేక్ష‌కులు సూప‌ర్ స‌క్సెస్ చేశారంటూ పేర్కొన్నారు వెంకీ మామ‌.

Also Read : Beauty Kriti Sanon : కృతి స‌న‌న్ ‘తేరే ఇష్క్ మే’

CinemaSankranthiki VasthunnamTrendingUpdatesvictory venkatesh
Comments (0)
Add Comment