Victory Venkatesh : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరుపొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అద్బుత విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని పూర్తిగా వినోదం ప్రధానంగా ఉండేలా తెరకెక్కించే ప్రయ్నతం చేశాడు. ఇందులో ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు హీరో విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి వెంకీ మామతో పోటీ పడి నటించారు.
Victory Venkatesh Movie Collections
విడుదలైన నాలుగు రోజులలోనే ఏకంగా రూ. 131 కోట్లు వసూలు చేసింది. కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ రావడంతో నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంతోషానికి లోనయ్యారు. ఇప్పటికీ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది సంక్రాంతికి వస్తున్నాం.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ కు ఇది మూడో సినిమా కావడం విశేషం. దిల్ రాజు ఈ మూడింటిని నిర్మించారు. వరుణ్ తేజ్ తో వెంకటేశ్ నటించిన ఎఫ్2 , ఎఫ్3తో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు వీటి సరసన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం వచ్చి చేరింది.
Also Read : Hero Balakrishna : సినిమా సక్సెస్ అందరిదీ – బాలయ్య