Victory Venkatesh: పెద్దోళ్లు అలా… కుర్రాళ్లు ఇలా అంటున్న వెంకీ

పెద్దోళ్లు అలా... కుర్రాళ్లు ఇలా... మీతో చాలా కష్టం బాసూ అంటున్న వెంకటేష్

Victory Venkatesh : వరుస విజయాలతో విక్టరీ నే ఇంటిపేరుగా మార్చుకున్న ఒకప్పటి టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్. ప్రస్తుతం వెంకటేష్ సీనియర్ హీరోల జాబితాలో చేరినప్పటికీ కాలానికి అనుగుణంగా సాగుతూ… నవ హీరోలతో పోటీపడి మరి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు వయసుకు తగ్గ పాత్రలో ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు. ఆయన ఇటీవల నటించిన ‘రాణా నాయుడు’ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల నుండి భిన్నమైన రెస్పాన్స్ అందుకున్నారు.

రాజా, కలిసుందాం రా, ప్రేమ, పెళ్ళి చేసుకుందాం, సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్ వంటి సినిమాలతో వెంకటేష్ కు బాగా దగ్గరయిన ఫ్యామిలీ ఆడియన్స్ కు … రాణా నాయుడు వెబ్ సిరీస్ లో ‘నాగా నాయుడు’ పాత్ర ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. చిన్న,పెద్ద అని తేడా లేకుండా కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాల్లో ఎప్పుడూ ముందుండే వెంకటేష్(Victory Venkatesh)… ఆ వెబ్ సిరీస్ లో నాగా నాయుడు పాత్రలో వెంకటేష్ వాడిన బూతులపై సీనియర్ ఆడియన్స్ కాస్తా హర్ట్ అయ్యారు. వెబ్ సిరీసుల్లో బూతులు సహజం అయినప్పటికీ వెంకటేష్ వంటి ఫ్యామిలీ హీరో కూడా ఆ బాష వాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది ఇలా ఉండగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మించిన ‘సైంధవ్‌’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 13న విడుదలకు సిద్ధమయింది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ ను ప్రారంభించిన ‘సైంధవ్‌’ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ కాలేజీలో ‘రాంగ్‌ యూసేజ్‌’ అనే పాటను విడుదల చేసింది. పాట విడుదల సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించింన వెంకటేష్ ను…. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ పార్ట్‌ 2 ఎప్పుడంటూ ఓ అభిమాని వేసిన ప్రశ్నకు ఆయన చాలా హుందాగా స్పందించారు.

Victory Venkatesh – పెద్దోళ్ళు, కుర్రోళ్ళు ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తా

‘‘నాగా నాయుడు… మామూలోడు కాదు. ‘నెట్‌ఫ్లిక్స్‌’ సంస్థ తీసుకొచ్చిన ఆ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. పెద్దవాళ్లేమో ‘ఏంటి.. నువ్వు అలా చేశావ్‌?’ అన్నారు. కానీ మీ కుర్రాళ్లంతా సీక్వెల్‌ అడుగుతున్నారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈసారి జాగ్రత్తగా ఉంటా. వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణలో పాల్గొంటా’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో వెంకటేష్ ఇచ్చిన సమాధానానికి ఒక్కసారిగా ఆడిటోరియం ఈలలు, కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

జనవరి 13న వస్తున్న ‘సైంధవ్‌’

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వెంకటేశ్‌ హీరోగా దర్శకుడు శైలేశ్‌ కొలను తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్‌’. తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కించిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : Niharika : నిహారిక చిన్నప్పుడు అంత పెద్ద తప్పు చేసిందా?

saindhavvictory venkatesh
Comments (0)
Add Comment