Vettaiyan OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీకి సిద్ధమవుతున్న తలైవా ‘వెట్టయన్’

ఈ సినిమాలో రజనీ విభిన్న పాత్రలో కనిపించి మెప్పించారు...

Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ వెట్టయన్. జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలైంది. వెట్టయన్(Vettaiyan) థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాకు జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మించింది. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి.

దీంతో ఓటీటీలోకి ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెట్టయన్(Vettaiyan) సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం వెట్టయన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రితికా సింగ్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిషోర్, తుషార విజయన్, రక్షణ ఇలా చాలా మంది నటించారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపించారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Vettaiyan Movie OTT Updates

ఈ సినిమాలో రజనీ విభిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ప్రేమ, హత్య కేసులు, భావోద్వేగాలతో కూడిన యాక్షన్ సినిమా వెట్టయన్. ఈ సినిమాలో రజనీ భార్యగా నటి మంజువారియర్ నటించారు. ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 86 కోట్లకు పైగా వసూలు చేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 240 కోట్లకు పైగా బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. రజనీకాంత్ సినిమా వెట్టయన్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. జైలర్‌లాగే ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించింది కాబట్టి. రూ. 90 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిందని అంటున్నారు. వెట్టయన్ చిత్రం అమెజాన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 7 న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Also Read : Gowtam Tinnanuri : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో కొత్త సినిమాతో జెర్సీ డైరెక్టర్

CinemaOTTTrendingUpdatesVettaiyanViral
Comments (0)
Add Comment