Vettaiyan: ఆశక్తికరంగా రజనీకాంత్ ‘వేట్టయన్‌: ద హంటర్‌’ తెలుగు ప్రివ్యూ వీడియో !

ఆశక్తికరంగా రజనీకాంత్ ‘వేట్టయన్‌: ద హంటర్‌’ తెలుగు ప్రివ్యూ వీడియో !

Vettaiyan: సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా ‘వేట్టయాన్‌(Vettaiyan)’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, రానా, ఫహాద్‌ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందించారు. తెలుగులో ‘వేట్టయాన్‌: ద హంటర్‌(Vettaiyan)’ పేరుతో అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్‌ తరహాలో ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. బుధవారం విడుదలైన ఈ తెలుగు వెర్షన్‌ ప్రివ్యూ వీడియోలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రితికా సింగ్ ల మధ్య జరిగే సంభాషణ ఆశక్తికరంగా ఉండటంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారుతోంది.

Vettaiyan Movie Updates

‘వేట్టయన్‌ ప్రివ్యూ’ పేరుతో తెలుగు విడుదల చేసిన వీడియో విషయానికి వస్తే… ‘‘ఈ దేశంలో లక్షలాది మంది పోలీసు అధికారులున్నారు. కానీ, వీళ్లని మాత్రమే చూడగానే గుర్తుపడుతున్నారంటే అదెలా సాధ్యమవుతుంది’’ అంటూ అమితాబ్‌ బచ్చన్‌ ప్రశ్నతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘మోస్ట్‌ డేంజరస్‌ క్రిమినల్స్‌ని భయపడకుండా ఎన్‌కౌంటర్‌ చేసినందు వల్ల వీళ్లు హీరోస్‌ అయ్యారు’ అని రితికా సింగ్‌ చెప్తూ… ‘మన ఎస్పీ అన్న పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అనే డైలాగ్స్‌ ఈ ప్రివ్యూ వీడియోలో ఉన్నాయి.

ఆఖర్లో ‘‘ఎన్‌కౌంటర్‌ పేరుతో ఓ మనిషిని హత్య చేయడం అదొక హీరోయిజమా’’ అని అమితాబ్‌ ప్రశ్నించగా… ‘‘ఎన్‌కౌంటర్‌ అనేది నేరం చేసిన వాళ్లకు విధించే శిక్ష మాత్రమే కాదు. ఇక మీదట ఇలాంటి నేరం మళ్లీ జరగకూడదని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’’ అంటూ రజనీ బదులివ్వడం టీజర్‌కు ఆకర్షణగా నిలిచింది. ఇందులో రజనీ ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ గా శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. టీజర్‌ లో రజనీ తనదైన స్టైల్, శ్వాగ్‌తో యాక్షన్‌ కోణంలో ఆసక్తి రేకెత్తించేలా కనిపించారు.

Also Read : Urmila Matondkar: పెళ్లైన 8 ఏళ్లకే విడాకులు తీసుకుంటోన్న రంగీలా బ్యూటీ !

Amitabh BachchanSuper Star RajanikanthVettaiyan
Comments (0)
Add Comment