Vettaiyan Movie : రజనీకాంత్ ‘వెట్టయన్’ సినిమా వివాదంపై స్పందించిన నిర్మాతలు

అయితే అన్ని భాషల్లోనూ ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్...

Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన’వేట్టయన్’ గురువారం (అక్టోబర్ 10) విడుదలైంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అన్ని భాషల్లోనూ ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో వేట్టయన్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది, ‘లైకా తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రతిభావంతులతో సంవత్సరాలుగా పనిచేస్తోంది.

అంతే కాదు, ‘RRR’, ‘సీతారామం’ వంటి అనేక అద్భుతమైన తెలుగు సినిమాలను తమిళనాడులో పంపిణీ చేసింది. ఇప్పుడు రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, రానా దగ్గుబాటి, ఫహద్‌ ఫాసిల్‌ తదితరులు నటించిన ‘వెట్టయన్‌(Vettaiyan)’ చిత్రాన్ని నిర్మించి, తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్‌ చేసి విడుదల చేశాం. , ‘ సినిమాకు ఏ భాషలో విడుదల చేస్తారో ఆ భాషలో టైటిల్ పెట్టాలని మొదట అనుకున్నాం. ‘ వెట్టయన్(Vettaiyan)’ చిత్రానికి తెలుగులో ‘వేటగాడు’ అనే పేరు పెట్టాలనేది ఉద్దేశం. పేరు నమోదు చేసుకునేందుకు కూడా ప్రయత్నించాం. కానీ మాకు ఆ టైటిల్ రాలేదు. సినిమాకి సరిపోయే పేరు, అది దొరక్కపోవడంతో, వేరే పేరు పెట్టడం సరికాదని, అసలు పేరుతోనే అన్ని భాషల్లో విడుదల చేశాం’

Vettaiyan Movie Updates

మా సినిమా అక్టోబర్ 10న విడుదలైంది, మొదటి నుండి తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని మేం కోరుతున్నాం. తెలుగులో విడుదలయ్యే సినిమాలకు తెలుగు టైటిల్స్ ఉంచాలనే మీ న్యాయమైన అభ్యర్థనను మేము గౌరవించాం. రానున్న రోజుల్లో కచ్చితంగా ఈ మార్పు తీసుకొస్తాం’ అన్నారు లైకా అధినేతలు. రజనీకాంత్ నటించిన ‘వెట్టయాన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి మరికొందరు ప్రముఖ నటులు. పోలీసు వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేలు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read : Prasanth Varma : ప్రశాంత్ వర్మ మూడవ చిత్రం ‘మహాకాళి’ గ్లింప్స్

CinemaSuper Star RajinikanthUpdatesVettaiyanViral
Comments (0)
Add Comment