Vetrimaaran: సినిమా రివ్యూలపై వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు

సినిమా రివ్యూలపై వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు

సినిమా రివ్యూలపై వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు

Vetrimaaran : ఇటీవల కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలపై రివ్యూల ప్రభావం తీవ్రంగా ఉంది. అరచేతిలోకి ఇంటర్ నెట్ వచ్చిన తరువాత ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు బుక్ చేసే వారి సంఖ్యలతో పాటు ఆన్ లైన్ లో రివ్యూలను చూసి సినిమాకు వెళ్ళేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా నిర్మాతలు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు డబ్బులిచ్చి మరీ పాజిటివ్ రివ్యూలు రాయిస్తున్న పరిస్థితులను చూస్తున్నాము. తన సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాసిన ఓ వెబ్ సైట్ పై బహిరంగ వేదికపై ఇటీవల కలర్స్ స్వాతి చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. అయితే సోషల్ మీడియా రివ్యూల ప్రభావం సినిమాపై ఉంటుందని కొందరు నమ్మితే… మరికొందరు మాత్రం కొట్టి పారేస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా రివ్యూలపై ప్రముఖ తమిళ నిర్మాత, రచయిత, దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Vetrimaaran – సోషల్ మీడియా రివ్యూలు సినిమా వసూళ్లపై ప్రభావం చూపవంటున్న వెట్రిమారన్

ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన ‘డైరెక్టర్స్‌ రౌండ్‌ టేబుల్‌’ సమావేశంలో పాల్గొన్న వెట్రిమారన్… సోషల్ మీడియా రివ్యూలు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా సినిమాల వసూళ్లపై ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేసారు. దీనికి తన సినిమాను ఉదాహరిస్తూ వెట్రిమారన్(Vetrimaaran) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ‘‘దాదాపు ఏడేళ్ల క్రితం నేను ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించా. దానికి సోషల్‌ మీడియాలో మంచి రివ్యూలు దక్కాయి. కానీ.. బాక్సాఫీసు వద్ద ఆ సినిమా కేవలం 1.45 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. అదే సమయంలో విడుదలైన మరో సినిమాకి నెగెటివ్‌ రివ్యూలు వచ్చినా 9 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది’’ అని అన్నారు.

‘విడుదలై: పార్ట్‌2’ షూటింగ్ లో బిజీగా ఉన్న వెట్రిమారన్

తమిళనాట ప్రముఖ దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. ఆడుకాలమ్‌, విసారణై, కాక్క ముట్టై, అసురన్ చిత్రాలకు 5 జాతీయ అవార్డులను అందుకున్న వెట్రిమారన్… విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ‘విడుదలై’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘విడుదలై: పార్ట్‌ 1’ సినిమాను రిలీజ్ అయి ఇప్పటికే మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపధ్యంలో ‘విడుదలై: పార్ట్‌2’ కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Surya’s Kanguva: 38 భాషల్లో ‘సూర్య’ కొత్త సినిమా !

Vetrimaaran
Comments (0)
Add Comment