Vetrimaaran: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో మూడేళ్ళక్రితం ప్రకటించిన సినిమా ‘వాడి వాసల్’. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీనితో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే నిలిచిపోయిందని భావించిన ఈ ప్రాజెక్టుపై దర్శకుడు వెట్రిమారన్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. దీనితో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని వస్తున్న కథనాలను కొట్టిపారేసినట్లయింది. ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Vetrimaaran Comment
ఇటీవల ఓ కార్యక్రమంలో దర్శకుడు వెట్రిమారన్(Vetrimaaran) మాట్లాడుతూ… ప్రస్తుతం తాను ‘విడుతలై పార్ట్2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నానని చెప్పారు. అది పూర్తైన తర్వాత తప్పకుండా ‘వాడి వాసల్’ రెగ్యులర్ షూట్ తిరిగి మొదలుపెడతానని స్పష్టతనిచ్చారు. అనంతరం ఆయన ధనుష్‌తో చేయనున్న ‘వడచెన్నై 2’ గురించి మాట్లాడుతూ… దానికి చాలా సమయం పడుతుందన్నారు. ‘వాడి వాసల్’ తర్వాత తాను ఏ ప్రాజెక్ట్ చేసేది తెలియదన్నారు.
జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడి వాసల్’ తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్ తొలిసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తున్నారు. 2021లోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 2022లో షూట్ మొదలుకాగా… సూర్యపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో చూపించే ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో సీజీ పనులు జరుగుతున్నాయని గతంలో వెట్రిమారన్ తెలిపారు.
Also Read : Super Star Rajinikanth: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ‘జైలర్ 2’ టైటిల్ !