Jayaprada : చలన చిత్ర రంగంలో మరిచి పోలేని పేరు జయప్రద. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తను నటించింది. ఎందరో స్టార్ హీరోలతో సమానంగా మెప్పించింది. దివంగత కె. విశ్వనాథ్ తీసిన సాగర సంగమం సినిమా తనను గొప్ప నటిగా నిలబెట్టింది. ఆ తర్వాత తన కెరీర్ లో గొప్పగా రాణించింది. ఇప్పటికీ ఎప్పటికీ తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సినిమా ఏదైనా ఉందంటే అది సాగర సంగమమేనని స్పష్టం చేసింది. నటిగా ఎమర్ గ్రీన్ హీరోయిన్ గా నిలిచిన జయప్రద(Jayaprada) రాజకీయాలలో కూడా రాణించింది. ప్రస్తుతం మౌనంగా ఉంది.
Jayaprada Comment
జయప్రద, జయసుధ, విజయశాంతి..ఇలా వీరంతా ఆనాటి కాలంలో ఒక ఊపు ఊపారు. జయప్రద తెలుగులోనే కాదు హిందీలో కూడా నటించింది. ఉత్తరాదిన కూడా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఒకానొక దశలో రేఖతో పోటీ పడింది. తను కూడా దక్షిణాదికి చెందిన తార కావడం విశేషం. తను హిందీలో నటించిన హిమ్మత్ వాలా మూవీ బ్లాక్ బస్టర్. డబలీవా అనే పాట టాప్ లో కొనసాగింది.
ఎంపీగా సమాజ్ వాది పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మంచి పాత్ర గనుక వస్తే నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు జయప్రద. ఏది ఏమైనా వెండి తెర మీద ఎల్లప్పటికీ నిలిచే తార జయప్రద. కాదనలేం ఎందుకంటే ఆమె అందం అద్భుతం.
Also Read : Popular Actress Dimple Kapadia :సినిమానే లోకం అదే ప్రపంచం