Venu Swamy : ఇకపై ఎప్పుడు సినిమా వాళ్ళ జాతకాలు చెప్పను

ఈ విషయమై మంచు విష్ణుని కలిసి మాట్లాడబోతున్నా అని ఆయన చెప్పుకొచ్చారు.

Venu Swamy : ఇటీవలే అక్కినేని అందగాడు నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇప్పుడు నాగ చైతన్య, శోభితా మూడేళ్ల తర్వాత విడిపోతారని జోస్యం చెప్పారు. వేణు స్వామి(Venu Swamy) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అంతే కాదు వేణు స్వామిపై ఫిర్యాదు దాఖలైంది.

అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వేణుస్వామిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, వేణు స్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతక విశ్లేషణ చేయను. అయితే ఇంతకుముందు నేను నాగ చైతన్య-సమంతర జాతక విశ్లేషణ చేసాను, అది చెప్పినట్లు జరిగింది, అదే జాతక విశ్లేషణలో భాగంగా నేను శోభిత-నాగ చైతన్య జాతక విశ్లేషణ చేసాను. అయితే ఇక నుంచి సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషణలు చేయను.. అని అన్నారు వేణుస్వామి.

Venu Swamy Comment

తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా నాగ చైతన్య, శోభిత జాతక విశ్లేషణలపై అసంతృప్తి వ్యక్తం చేశారని, తనకు ఫోన్ చేసి ఈ విషయం మాట్లాడారని వేణు స్వామి(Venu Swamy) తెలిపారు. ఈ విషయాన్ని ఆయనకు క్లారిటీ ఇచ్చాను. ఇకపై ప్రముఖుల జాతకాలను విశ్లేషించను’. ఈ విషయమై మంచు విష్ణుని కలిసి మాట్లాడబోతున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు, వేణు స్వామి నాగ చైతన్య, సమంతలతో పాటు పలువురు నటీనటుల జాతకాలు విశ్లేషించారు. ప్రభాస్ కు ఇక పై సక్సెస్ రాదు అని ఆయన అన్నారు.. కానీ సలార్, కల్కి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.అలాగే ప్రభాస్ పెళ్లికి కూడా కామెంట్స్ చేశారు. వీటితోపాటు ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషణలు కూడా చేశారువేణు స్వామి. కానీ జగన్ పార్టీ ఓడిపోయింది. అనంతరం వీడియో అప్‌లోడ్ చేసిన వేణు స్వామి.. ఇక నుంచి రాజకీయనాయకుల జాతకాన్ని విశ్లేషించను చెప్పుకొచ్చారు.

Also Read : Prasanth Varma : తాను చదువుకున్న బడి పంతుళ్ళతో ముచ్చటించిన ‘హనుమాన్’ డైరెక్టర్

BreakingCommentsVenu SwamyViral
Comments (0)
Add Comment