Venu Swamy : హై కోర్టు వరకు వెళ్లిన నాగచైతన్య, శోభిత ల జాతకం వివాదం

దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలోతెగ వైర‌ల్ అయి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది...

Venu Swamy : నాగచైతన్య, శోభిత లకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై , మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఇప్పుడు ఈ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. నిత్యం సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ వివాదాల్లో ఉంటుంటాడు ప్ర‌ముఖ అస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామి ఇటీవ‌ల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జ‌రిగిన త‌ర్వాత‌ వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఇజంట ఎక్కువ రోజులు క‌లిసి ఉండ‌లేరు, రెండు మూడు సంవ‌త్స‌రాల‌లోనే విడిపోతారు అని.. అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు.

Venu Swamy..

దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలోతెగ వైర‌ల్ అయి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. చాలామంది బాహాటంగానే వేణుస్వామి(Venu Swamy) ని తిడుతూ పోస్టులు పెట్టి ఎడా పెడా వాయించేశారు. కొంత‌మంది పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్ర‌మంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు రియాక్ట్ అయి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదను క‌లిసి వేణు స్వామిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ విష‌య‌మై వేణు స్వామి వివరణ కోరుతూ వ్యక్తిగ‌తంగా హ‌జ‌ర‌వ్వాల‌ని మహిళా కమీషన్ నోటీసు పంప‌గా.. వేణు స్వామి ఆ నోటీసుపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించాడు. మహిళా కమీషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. నాగచైతన్య , శోభిత లకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై, మహిళా కమీషన్ పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Also Read : Khushbu Sundar : ‘హేమ కమిటీ’ రిపోర్ట్ పై స్పందించిన అగ్ర నటి ‘ఖుష్బూ’

Akkineni Naga ChaitanyaBreakingSobhita DhulipalaUpdatesVenu SwamyViral
Comments (0)
Add Comment