Venu Swamy : నాగ చైతన్య, శోభిత లపై కీలక వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి

అయితే ఈరోజు ఉద‌యం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ఇరువురి జాతకంపై వీడియో రిలీజ్ చేశాడు...

Venu Swamy : ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌, శోభిత‌ల ఎంగేజ్‌మెంట్ సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ ప్ర‌తి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రి నోటా విన్నా ఇప్పుడు ఈ జంట‌, స‌మంతల పేరే వినిపిస్తుండ‌గా వీరి వ్య‌వ‌హ‌ర‌మే బాగా చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ విష‌యంలోకి ప్ర‌ముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్‌మెంట్ వార్త‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చాడు. అయితే ఈరోజు ఉద‌యం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే ఇరువురి జాతకంపై వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో వారి జాతకం బాలేదంటూ కామెంట్స్ చేశాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని, 2027 వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నాడు. అంతేకాక వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని వేణు స్వామి చెప్పాడు.

Venu Swamy Comment..

పైపెచ్చు వారు నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో గల్లీ జ్యోతిష్యుడు కూడా చెప్పగలడని వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగిందన్నారు. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి అని అందులో నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయన్నారు. శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు, గురుడుల‌ మీద ఉందన్నారు. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయని అన్నాడు. నేను కావాల‌ని, తెలియ‌కుండా చెప్ప‌డంలేద‌ని నేను చెప్పిన జాత‌కం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Also Read : Niharika Konidela : ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్ తీసిందే..

Akkineni Naga ChitanyaBreakingCommentsmarriageSobhita DhulipalaVenu SwamyViral
Comments (0)
Add Comment