Allu Arjun : అల్లు అర్జున్ సీఎం అవుడదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి

అయితే ఇందుకు సంబంధించిన వేణు స్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది...

Allu Arjun : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ ఉంది. 100 శాతం ఆయన కచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు’ అంటూ గట్టిగా చెప్పాడు వేణు స్వామి.

Venu Swamy Comments on Allu Arjun

అయితే ఇందుకు సంబంధించిన వేణు స్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై బన్నీ అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి. కొందరు వేణుస్వామి మాటలను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈయన మాటలు పక్కుకు పెడితే.. ఇదివరకే అల్లు అర్జున్ టీమ్ ఈ పొలిటికల్ రూమర్లను ఖండించింది. ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీమ్.

Also Read : Rashmika Mandanna : తన లైఫ్ పార్టనర్ క్వాలిటీస్ పై క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్

allu arjunCommentsVenu SwamyViral
Comments (0)
Add Comment