Venkatesh : దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం(). ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలై ఎవరూ ఊహించని రీతిలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఏకంగా అతి తక్కువ కాలంలోనే రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి పోటీగా రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడగా బాలయ్య నటించిన డాకు మహారాజ్ రూ. 130 కోట్లు సాధించింది పర్వాలేదని అనిపించింది.
Venkatesh Sankranthiki Vasthunnam OTT Updates
ఇక అంచనాలు దాటేసి అద్బుతమైన సినిమాగా పేరు పొందిన వెంకీ మామ మూవీని చేజిక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. చివరకు రికార్డ్ స్థాయిలో జీ గ్రూప్ స్వంతం చేసుకుంది. ఏక కాలంలో అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీ లోనూ స్ట్రీమింగ్ కు ప్లాన్ చేసింది. ఇది కూడా వర్కవుట్ అయ్యింది. అంచనాలు దాటేసి రికార్డ్ స్థాయిలో వ్యూయర్స్ ను పొందింది ఈ మూవీ. ఓటీటీ రికార్డులను బద్దలు కొట్టింది సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam). టీఆర్పీ బెంచ్ మార్క్ ను కూడా దాటేసింది. సినీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది.
ఫక్తు కామెడీ, కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించాడు అద్భుతంగా దర్శకుడు అనిల్ రావిపూడి. అలాగే భీమ్స్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇక కొత్తగా వచ్చిన బుల్లోడు సూపర్ కామెడీ పండించాడు. ఇక మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి, భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించారు. ఇక ఎప్పటి లాగే తన వంతుగా కామెడీ పండించంలో సక్సెస్ అయ్యాడు విక్టరీ వెంకటేశ్. 18.1 టీఆర్పీని సాధించింది. 310 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి ఔరా అనిపించేలా చేసింది.
Also Read : Hero Pradeep Ranganathan-Vignesh :ప్రదీప్ విఘ్నేష్ మూవీపై ఉత్కంఠ