Venkatesh : సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి తమదైన రీతిలో సక్సెస్ సాధించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య విడుదలైంది.
Victory Venkatesh Movie…
ఈసారి ఫెస్టివల్ కు ప్రత్యేకించి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ , బాబ్జీ దర్శకత్వం వహించిన బాలయ్య నటించిన డాకూ మహారాజ్, విక్టరీ వెంకటేశ్(Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి.
ఈ మూడూ హిట్ టాక్ అందుకున్నాయి. ప్రత్యేకించి మరోసారి నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా వరకు వస్తే అన్ని వర్గాలను అలరించేలా ఉంది. అనిల్ అంటేనే కామెడీకి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. మరోసారి వెంకీ కాంబినేషన్ వర్కవుట్ అయ్యింది.
ఇద్దరి కాంబినేషనలో ఇప్పటికే వచ్చిన ఎఫ్ -2, ఎఫ్-3 భారీ విజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ సినిమాల సరసన ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం చేరింది. ఈ సినిమాలో విక్టరీ వెంకీ మామతో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, వీకే నరేష్, ఉపేంద్ర లిమియా, వీటి గణేష్ , సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది సంగీతం. భీమ్స్ సిసిరిలియో అందించాడు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ అనిల్ రావిపూడిదే. దిల్ రాజు, శిరీష్ దీని కోసం భారీగా ఖర్చు చేశారు.
మొత్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినీ వర్గాలు ఇక సినిమాకు ఢోకా లేదంటూ ప్రకటించారు.
Also Read : Popular Director Gautham Menon : దర్శకుడు గౌతమ్ మీనన్ భావోద్వేగం