Venkatesh Saindhav: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సైంధవ్’. శ్రద్ధా శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్… బుధవారం ‘సైంధవ్(Saindhav)’ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. వెంకటేష్- బేబీ సారా మధ్య ఎమోషనల్ బాండింగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఆ ప్రేమను దర్శకుడు శైలేష్ చాలా బాగా చూపించాడు.
తరువాత అరుదైన వ్యాధి బారిన తన కుమార్తెను కాపాడుకోవడానికి రూ.17 కోట్లు ఖరీదైన ఇంజెక్షన్ కోసం విలన్ తో పోరాడే సైకో పాత్రలో వెంకటేష్ పడిన తపన ట్రైలర్‌లో ఆకట్టుకుంది. నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కధరా అంటూ వెంకీ చెప్పే ఎమోషన్ డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Venkatesh Saindhav Updates
ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే వెంకీకి సైకో పాత్ర కూడా బాగా సెట్ అయింది. ట్రైలర్‌లో వెంకీని యాక్షన్ అవతార్ ను దర్శకుడు అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ నటన అద్భుతంగా ఉంది. ఓవైపు యాక్షన్ మరోవైపు ఎమోషన్స్‌ను రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా ట్రైలర్‌లో నవాజుద్దీన్ నటన ఆకట్టుకుంది. ఇక నిర్మాణ విలువలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Pushpa The Rule : పుష్ప-2 కోసం యాంకర్ దగ్గర పాటలు నేర్చుకున్న సుకుమార్