Victory Venkatesh Movie : ఆ ఓటీటీలో రానున్న వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’

ఇక ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ చూస్తుంటే భారీ ఓపెనింగ్ దక్కడం ఖాయంగా చెప్పవచ్చు...

Venkatesh Movie : సంక్రాంతికి వస్తున్నాం మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విక్టరీ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఈ మూవీ రేపు(జనవరి 14) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అభిమానులకు మరో క్రేజ్ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా టికెట్ల బుకింగ్స్ చూస్తుంటే భారీ ఓపెనింగ్ దక్కడం ఖాయంగా చెప్పవచ్చు. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ పార్ట్‌నర్‌‌ సమాచారం బయటకొచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

Venkatesh Movie Sankranthiki Vasthunnam OTT..

దీంతో థియేట్రికల్ రన్ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ, ఫిబ్రవరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా మూవీ టీం, చాలా హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొని, మూవీని ప్రమోట్ చేశారు. ఇక జనవరి 14 రేపు సినిమా విడుదల కానంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సినిమా పాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read : Hero Jayam Ravi : తన పేరును మార్చుకున్న తమిళ స్టార్ హీరో

CinemaOTTSankranthiki VasthunnamTrendingUpdatesvictory venkatesh
Comments (0)
Add Comment