Veenah Rao: వెండి తెరకు వీణరావును పరిచయం చేస్తున్న వైవిఎస్ చౌదరి !

వెండి తెరకు వీణరావును పరిచయం చేస్తున్న వైవిఎస్ చౌదరి !

Veenah Rao: ‘దేవదాసు’, ‘సీతయ్య’ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వై.వి.ఎస్‌ చౌదరి(YVS Chowdary). కొన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు. నందమూరి జానకీరామ్‌ తనయుడు నందమూరి తారక రామారావు ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు. న్యూ టాలెంట్‌ రోర్స్‌ పతాకంపై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు.ఇప్పుడీ సినిమా కోసం తెలుగమ్మాయి వీణ రావు(Veenah Rao)ను కథానాయికగా ఎంపిక చేశారు. అలాగే సాయిమాధవ్‌ బుర్రా మాటల రచయితగా.. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా.. చంద్రబోస్‌ పాటల రచయితగా వ్యవహరించనున్నారు. ఈ విషయాల్ని చిత్ర బృందం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో అధికారికంగా ప్రకటించింది.

Veenah Rao….

ఈ సందర్భంగా దర్శకుడు వైవిఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘‘కంచె’ సినిమా చూసినప్పుడే సాయిమాధవ్‌ బుర్రాతో పని చేయాలని అనుకున్నా. ఈ చిత్రంతో అది సాధ్యమైనందుకు ఆనందంగా ఉంది. ఈ కథ విని కీరవాణి చాలా సంతోషపడ్డారు. ఓ పెద్దన్నలా సలహాలు, సూచనలిచ్చారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి చంద్రబోస్‌ అందించే సాహిత్యం మహా అద్భుతంగా ఉండనుంది’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నాను. చాలా బాగుంది. ఈ బ్యానర్‌ పేరుకు తగ్గట్లుగానే ప్రతిభ గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీనికి నాకు మంచి సంభాషణలు రాసే అవకాశం దొరికింది’’ అన్నారు రచయిత సాయిమాధవ్‌ బుర్రా.

నందమూరి తారకరామారావు వీరాభిమానిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన వైవిఎస్ చౌదరి… చాలా గ్యాప్ తర్వాత నందమూరి కుటుంబం‌లోని నాలుగోతరం నట వారసుడిని పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా’ అని వైవిఎస్‌ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు.

దీనితో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుండి నాలుగోతరం హీరోగా వస్తున్న నందరమూరి తారక రామారావును సినిమా ఇండస్ట్రీలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వైవీఎస్ చౌదరి భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్‌ రోర్స్‌ అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నారు.

Also Read : Suriya: హీరో సూర్యకు షూటింగ్‌ లో స్వల్ప గాయాలు !

Nandamuri Hari KrishnaVeenah RaoYVS Chowdary
Comments (0)
Add Comment