Varun Tej: ఆపరేషన్ వాలెంటైన్’ నుండి వందేమాతరం లిరికల్ సాంగ్ రిలీజ్ !

ఆపరేషన్ వాలెంటైన్’ నుండి వందేమాతరం లిరికల్ సాంగ్ రిలీజ్ !

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రముఖ యాడ్ ఫిల్మ్‌ మేకర్‌, సినిమాటోగ్రఫర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో వరుణ్‌ తేజ్‌(Varun Tej) ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది భారత వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెరపై ఆవిష్కరించే విధంగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ను ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Varun Tej Movie Updates

ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా నుండి వందేమాతరం అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నుండి విడుదలై విజయవంతమైన సినిమా ‘మేజర్’. ‘మేజర్’ తర్వాత మరొక దేశభక్తి అడ్రినలిన్ పంపింగ్ థ్రిల్లర్ గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనితో ‘వందేమాతరం’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read : Radhika Apte: ఎయిర్‌ పోర్టులో నరకం అనుభవించానంటున్న సెక్సీ బ్యూటీ !

Operation ValentineVarun Tej
Comments (0)
Add Comment