Varun Tej: అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న మెగా ప్రిన్స్ వరున్ తేజ్… నెల రోజుల తరువాత వెకేషన్ కు ఎంచక్కా ఫారిన్ చెక్కేసారు. పెళ్లై వారం రోజులు తిరగకముందే తన నెక్స్ట్ తాజా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వరుణ్ తేజ్. ఇటలీలో పెళ్లి, హైదరాబాద్ లో రిసెప్షన్ ఫోటోలు వైరల్ గా మారడంతో వీరి హనీమూన్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో చర్చ కనిపించింది.
Varun Tej and His Wife in Vacation
అయితే అనూహ్యంగా వరుణ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో పాల్గొనడంతో ఈ కొత్త జంటకు హనీమూన్ లేనట్లే అని అభిమానులు భావించారు. అయితే పెళ్ళై సరిగ్గా నెల రోజులు దాటిన తరువాత ఈ జంట ఫారిన్ చెక్కేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది హనీమూన్ ట్రిప్పా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమకు అచ్చొచ్చిన ఇటలీ వెళ్లారా ? లేదంటే మాల్దీవులుకి ఏమైనా వెళ్లారా అని నెటిజన్లు వివిధ హనీమూన్ల దేశాల పేర్లు పెడుతున్నారు. అయితే వెకేషన్ ట్రిప్ లో ఉన్న వరుణ్(Varun Tej), లావణ్య ఇద్దరిలో ఎవరో ఒకరు ఫోటోలు పోస్ట్ చేస్తే అసలు వీరిది హనీమూనా… సరదా వెకేషన్ ట్రిప్పా అనేది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆరేళ్ళ స్నేహ బంధానికి ముగింపు పలుకుతూ నవంబరు 1న ఇటలీలోని టస్కానీ వేదికగా ఒక్కటైన ఈ ప్రేమ జంట… ఇటీవల హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
పెళ్ళి, రిసెప్షన్ తరువాత ఈ కొంత జంట తమ హానీమూన్ ను ఎక్కడ ప్లాన్ చేసిందో అంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా ప్రారంభమయింది. మరికొన్ని రోజుల్లో హనీమూన్ ఫోటోలు కూడా చూడబోతున్నామం అంటూ తెగ ఆనందపడిన మెగా ఫ్యాన్స్ కే కాకుండా తన భార్య లావణ్యకు…. ‘ఆపరేషన్ వాలెంటైన్’ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో పాల్గొని షాకిచ్చాడు వరుణ్ తేజ్… అయితే నెల రోజుల తరువాత తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి ఫారిన్ వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల బట్టి తెలుస్తోంది.
Also Read : Mahesh Babu: మహేశ్ బాబును భయపెడుతున్న క్యూట్ జిమ్ ట్రైనర్