Varun Sandesh: యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో రాజేశ్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘నింద’. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాను రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు, శ్రీరామ సిద్ధార్థ కృష్ణలు కీలక పాత్ర పోషించారు. జూన్ 21న థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో ఈ మూవీని రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Varun Sandesh Movie Updates
ఇక ట్రైలర్ విషయానికి వస్తే… “మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు… ఒక సమాజం చనిపోయినట్టు” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమై సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ట్రైలర్ చూస్తుంటే ఓ రేప్ & మర్డర్ కేసులో ఒకర్ని ఇరికిస్తే అతను తప్పుచేయకుండానే ఎవరెవరో కలిసి అతన్ని ఇరికించినట్లు, అలా చేసిన వాళ్ళందర్నీ వరుణ్ సందేశ్ ఏం చేసాడు అనే ఆసక్తికర కథాంశంతో సాగనున్నట్టు తెలుస్తుంది. అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు అనే పాయింట్.. అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. మరి ఈ మూవీతో నైనా వరుణ్ సందేశ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?
Also Read : Y. V. S. Chowdary: టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నందమూరి నాలుగోతరం హీరో !