Varun Sandesh: వైరల్ అవుతున్న వ‌రుణ్ సందేశ్‌, వితికా గృహ‌ప్ర‌వేశం వీడియో !

వైరల్ అవుతున్న వ‌రుణ్ సందేశ్‌, వితికా గృహ‌ప్ర‌వేశం వీడియో !

Varun Sandesh: హ్యాపీడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వరుణ్ సందేశ్. తెలుగురాష్ట్రాల్లో యూ ట్యూబర్ గా సుపరిచితం అయిన సెలబ్రెటీ వితికా షెరు. 2019లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన వీరు ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 3 తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మ‌ధ్య సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో వ‌రుణ్ సందేశ్‌(Varun Sandesh) ఎక్కువ‌గా అమెరికాలోనే ఉంటుండ‌గా… ఆయ‌న భార్య వితికా మాత్రం డిజైన‌ర్‌ గా, ప్ర‌జంట‌ర్‌గా రాణిస్తూనే ఇప్పుడు యూ ట్యూబ‌ర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల ఆమె సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆకట్టుకుంది. దీనితో యూట్యూబ్‌ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా త‌మ ఇంటి గృహ ప్ర‌వేశానికి సంబంధించిన వీడియోను పోస్టు చేయ‌గా… నిమిషాల్లోనే ల‌క్ష‌ల వ్యూస్ సాధించి ట్రెండింగ్‌ లో కొనసాగుతోంది. అయితే ఈ గృహ‌ప్ర‌వేశం 2023 మేలో జ‌రుగ‌గా… వితికా రెండు రోజుల క్రితం త‌న యూ ట్యూబ్‌ ఛానెల్ లో ఈ వీడియో పోస్టు చేసింది.

Varun Sandesh Photos Viral

ఈ సంద‌ర్భంగా వితికా షెరు మాట్లాడుతూ… ఆ ఇంటి కోసం త‌ను ప‌డిన క‌ష్టాన్ని వివ‌రించింది. తమ ఇంటి గురించి వివరిస్తూ ప్రతి విషయంలో వారు తీసుకున్న‌ జాగ్రత్తలను వివరించింది. అస‌లు నా సొంత డ‌బ్బుతోనే స్వంతంగా ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్నాన‌ని కానీ కుద‌ర‌లేద‌ని మా మామయ్య- అత్తయ్యలున్న‌ పాత ఇంటినే వ‌రుణ్‌, నా అభిరుచుల‌కు అనుగుణంగా ద‌గ్గ‌రుండి డిజైన్ చేసుకున్నామ‌ని తెలిపింది. చాలా రోజుల నుంచి చాలామంది రెగ్యుల‌ర్‌గా వీడియోలు చేయ‌ట్లేద‌ని అడుగుతున్నార‌ని, అయితే ఇన్ని రోజులు సొంత ఇల్లు లేకున్నా అలా జ‌రిగింద‌ని ఇక‌పై అలా ఉండ‌ద‌ని రెగ్యుల‌ర్‌గా కొత్త‌కొత్త కాన్సెప్ట్‌ల‌తో వీడియోలు చేస్తాన‌ని చెప్పుకొచ్చింది. వ‌రుణ్‌, వితికాల గృహ ప్ర‌వేశం వీడియోను చూసిన సినీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Also Read : Actress Sonarika : ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడిన బుల్లితెర నటి సోనారిక

Varun SandeshVithika Sheru
Comments (0)
Add Comment