Varun Sandesh: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మోషన్ పోస్టర్ విడుదల !

వరుణ్ సందేశ్ 'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల !

Varun Sandesh: హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్… ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలతో వస్తున్నాడు. నింద, విరాజి లాంటి థ్రిల్లర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మెప్పించి ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమా ‘కానిస్టేబుల్’తో రాబోతున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మాణంలో ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో ఈ ‘కానిస్టేబుల్’ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ సందేశ్‌కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్‌ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు. ఈ మోషన్ వీడియో చూస్తుంటే మోకిలా పోలీస్ స్టేషన్ లో జరిగే ఏదో సంఘటన, అక్కడ పనిచేసే కానిస్టేబుల్ వరుణ్ సందేశ్ ఏం చేసాడు అని ఆసక్తిగా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Varun Sandesh Movie Updates

ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh) మాట్లాడుతూ.. ‘సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుంది” అని చెప్పారు.

నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు.

Also Read : Laggam: తెలంగాణ నేపథ్యంలో మరో పల్లెలూరి కథ ‘లగ్గం’ !

ConstableVarun Sandesh
Comments (0)
Add Comment