Varun Lavanya Video : స్టార్ డమ్ ఉంటే ఇప్పుడు కోట్లకు కొదవే లేదు. విచిత్రం ఏమిటంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి(Lavanya) పెళ్లికి సంబంధించిన వీడియోను స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. ప్రస్తుతం వరుణ్ లావ్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రిండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.
Varun Lavanya Video Viral
ఇందుకు సంబంధించి సదరు సంస్థ మెగా ఫ్యామిలీతో కేవలం స్ట్రీమింగ్ చేసేందుకు గాను భారీ ఎత్తున కాంట్రాక్టు కుదుర్చుకుందని, దాని వాల్యూ కనీసం రూ. 8 కోట్లకు పైగా ఉందని టాక్ కొనసాగుతోంది. ఇప్పటికే వరుణ్ , లావణ్య ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
విచిత్రం ఏమిటంటే వీరిద్దరి పెళ్లి ఇండియాలో కాకుండా ఇటలీలో ప్లాన్ చేశారు. అక్కడికి మెగా కుటుంబం మొత్తం తరలి వెళ్లింది. సందడి చేసింది. ఘనంగా, అంగ రంగ వైభవోపేతంగా జరిగింది ఈ పెళ్లి. వరుణ్ తేజ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో శేఖర్ కమ్ముల తీస్తే మరో మూవీ ఎఫ్ 2, ఎఫ్ 3 భారీ సక్సెస్ ను సాధించాయి. ఈ రెండు సినిమాలకు దర్శకుడు అనిల్ రావిపూడి.
మొత్తం మీద వరుణ్ , లావణ్య త్రిపాఠిలు ఇప్పుడు సంచలనంగా మారడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : Eagle Movie Teaser : మాస్ మహరాజా డైలాగ్స్ అదుర్స్