Samantha : సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో వరుణ్ ధావన్

మరో ఇంటర్యూలో సమంత మాట్లాడుతూ "మయోసైటిస్‌ కారణంగా ఈ వెబ్‌సిరీస్‌ చేయకూడదు....

Samantha : సమంత ప్రస్తుతం తాను నటించిన మోస్ట్‌ అవైటింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ రూపొందింది. ఇందులో సమంత(Samantha) హనీ పాత్రలో స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఇటీవల దీని ట్రైలర్‌ విడుదల చేయగా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. సిరీస్‌ విడుదల కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు. వరుణ్‌ ధావన్‌ కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా వరుణ్‌ ధావన్‌ ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ గురించి మాట్లాడారు. ‘ సమంతను అట్లీ ఎన్నోసార్లు ప్రశంసించారు. ఆమెను ‘ఫిల్మ్‌ స్టార్‌’ అంటారు. మేము సమంత గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా అట్లీ ఆమెను ‘సూపర్‌ స్టార్‌’ అనే పిలుస్తారు. తన వర్క్‌కు అట్లీ పెద్ద అభిమాని. ఆమె నటన ఎంత గొప్పగా ఉంటుందో అంతే ప్రొఫెషనల్‌గా కూడా ఉంటుంది. ఆమెతో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపించాయి. సినిమాపై మా ఇద్దరికి ఉన్న అభిరుచి వల్ల మేం త్వరగా కనెక్ట్‌ అయ్యాం. మా ఇద్దరికీ కొత్తగా చేయాలనే ఆలోచన ఉంటుంది’’ అన్నారు.

Samantha..

మరో ఇంటర్యూలో సమంత మాట్లాడుతూ “మయోసైటిస్‌ కారణంగా ఈ వెబ్‌సిరీస్‌ చేయకూడదు.. తిరస్కరించాలనుకున్నా. అయితే ఈ స్క్రిప్ట్ చూశాక నేను చేయగలనా అనిపించింది. నేను ఇందులో చేశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఒక్కోరోజు ఆరోగ్యం సహకరించకపోయినా ఉదయం నాలుగు గంటలకే షూట్‌కు వెళ్లేదాన్ని. అప్పటినుంచి మధ్యాహ్నం వరకు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేదాన్ని. ఆ సమయం చాలా కష్టంగా గడిచేది. ‘ నువ్వు షూట్‌ చేయగలవా’ అని రాజ్‌ ఎన్నోసార్ల్లు అడిగారు. చేయలేనని చెప్పేదాన్ని. అయినా ఈ సిరీస్‌ పూర్తిచేశానంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే’’ అని సమంత చెప్పారు.

Also Read : Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు..

Indian ActressesSamanthaTrendingUpdatesVarun DhawanViral
Comments (0)
Add Comment