Allu Arjun: అల్లు అర్జున్‌ కు ‘క్రాక్‌’ జయమ్మ స్పెషల్ ఇన్విటేషన్ !

అల్లు అర్జున్‌ కు 'క్రాక్‌' జయమ్మ స్పెషల్ ఇన్విటేషన్ !

Allu Arjun: దక్షిణాది భాషల ప్రముఖ నటి వరలక్ష్మీ శరత కుమార్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ తో ఆమె త్వరలో ఏడు అడుగులు వేయనుంది. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన ఈ కోలీవుడ్ బ్యూటీ… ప్రస్తుతం కాబోయే భర్త సచ్ దేవ్ తో కలిసి అతిథులను ఆహ్వానించడంలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలుస్తూ అందరినీ తమ పెళ్లికి ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ పెళ్లికి రావాల్సిందిగా అల్లు ఫ్యామిలీని ఆహ్వానించారు ఈ కాబోయే దంపతులు. అల్లు అరవింద్‌, బన్నీ(Allu Arjun)కి పెళ్లి పత్రికలు అందజేసారు. ఈ సందర్భంగా వారితో తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి.

Allu Arjun…

శుక్రవారం ఉదయం గీతా ఆర్ట్స్‌లో ఆమె అల్లు అరవింద్‌ ను కలిసినట్లు తెలిస్తోంది. ఆయనతో, బన్నీతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను తనకు కాబోయే భర్త తీశాడట. నికోలయ్‌ను బన్నీకి పరిచయం చేసింది వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. వాళ్ళిద్దరి మధ్య క్యూట్‌ సంభాషణ జరిగింది. కాబోయే భర్తతో హైదరాబాద్‌ వచ్చిన వరలక్ష్మీ ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. తాను ఫోటోకి ఫోజ్‌ ఇస్తుంటే… నికోలయ్‌ ఏటో చూస్తున్నారని ఆవిడ చేసిన పోస్ట్‌లో పేర్కొంది.

‘క్రాక్‌’ సినిమాతో జయమ్మ పాత్రతో తెలుగునాట పాపులర్‌ అయిన వరలక్ష్మీ అక్కడి నుంచి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశం అందుకుంటోంది. హీరోయిన్ గా కాకుండా పాత్ర తనకు సూట్‌ అవుతుంది అంటే నెగటివ్‌ రోల్‌ చేయడానికి కూడా వెనకాడటం లేదు. అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్‌ నిర్మించిన ‘కోట బొమ్మాళి పీఎస్‌’లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేశారు.

Also Read : Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో చోరీ !

Allu Aravindallu arjunVaralaxmi Sarathkumar
Comments (0)
Add Comment