Varalaxmi Sarathkumar: దక్షిణాది భాషల నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్ ను వరలక్ష్మీ ప్రేమించి వివాహం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రాబి బీచ్ రిసార్ట్‌లో 2024 జులై 10న వారి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సముద్రం ఒడ్డున జరిగిన ఈ వివాహ వేడుకతో గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్, వరలక్ష్మి(Varalaxmi Sarathkumar) ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి జీవితాల్ని పంచుకున్నారు. దక్షిణ భారత సంప్రదాయ పద్ధతుల్లో వారి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Varalaxmi Sarathkumar…
అయితే, వరలక్ష్మీ శరత్ కుమార్ కుటుంబం నుంచి పెళ్లి తేదీ ఎప్పుడు అనేది గతంలో వారు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనితో అందరూ వారి వివాహం జులై 2 అని భావించారు. జులై 4న చెన్నైలోని తాజ్ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. దీనితో వారి వివాహం జులై 2న పూర్తి అయిందని అందరూ భావించారు. ఆ కార్యక్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. రజనీకాంత్, బాలకృష్, వెంకటేశ్, మంచు లక్ష్మి, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి స్టార్స్ ఆ రిసెప్షన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. పెళ్లితో సమానంగా ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కానీ, వారి వివాహం జులై 10న థాయ్‌లాండ్‌లో జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Also Read : Balakrishna Nandamuri: బాలకృష్ణ నట జీవితానికి 50 ఏళ్లు పూర్తి ! 50 ఏళ్ళ పండుగకు సినీ పరిశ్రమ సన్నాహాలు !