Varalaxmi Sarathkumar: డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైన వరలక్ష్మి శరత్ కుమార్ !

డెస్టినేషన్ వెడ్డింగ్ కు సిద్ధమైన వరలక్ష్మి శరత్ కుమార్ !

Varalaxmi Sarathkumar: హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోంది. తన 14 ఏళ్ళ తన స్నేహ, ప్రేమ బంధానికి ముగింపు పలికి వివాహ బంధంలోనికి అడుగుపెట్టడానికి తొలి అడుగు వేస్తూ ఇటీవలే తన ప్రియుడు నికోలాయి సచ్‌ దేవ్ తో నిశ్చితార్ధం చేసుకున్న ఈ లేడీ విలన్… త్వరలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవ్ తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ ఫిక్స్ అయిందని… జూలై 2న థాయ్‌ లాండ్‌లో వివాహ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారని టాక్. అది అయిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఉండనుందని సమాచారం.

Varalaxmi Sarathkumar…

కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లో అడుగుపెట్టిన వరలక్ష్మి(Varalaxmi Sarathkumar)… తమిళనాట చాలా మంది హీరోలతో కలిసి నటించింది. అయితే పెద్దగా కలిసి రాలేదు. దీనితో విలన్ తరహా పాత్రలు ప్రారంభించడంతో ఒక్కసారిగా సక్సెస్ అయింది. టాలీవుడ్ లో ప్రముఖ లేడీ విలన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్… గతంలో హీరో విశాల్‌తో ప్రేమాయణం నడిపిందని… తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత కోలీవుడ్ హీరోలు ధనుష్ లేదా శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. గత 14 ఏళ్ల నుంచి ఇద్దరికీ పరిచయముంది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది.

Also Read : Sriranga Neethulu: ఓటీటీలో కాకుండా డైరెక్ట్ గా యూట్యూబ్‌ లోకి వచ్చేస్తున్న సుహాస్‌ సినిమా !

Radhika SarathkumarSarathkumarVaralaxmi Sarathkumar
Comments (0)
Add Comment