Varalaxmi Sarathkumar: ప్రియుడితో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విహారయాత్ర !

ప్రియుడితో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విహారయాత్ర !

Varalaxmi Sarathkumar: హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌ తో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నిశ్చితార్ధం తరువాత తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోలను పోస్ట్ చేసి తమ 14 ఏళ్ళ స్నేహ, ప్రేమ బంధానికి ముగింపు పలికి పెళ్లి బంధంలోనికి అడుగుపెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. దీనితో ఆమెకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Varalaxmi Sarathkumar Tour

అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత తొలిసారి కాబోయే భర్తతో సరదాగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇద్దరూ జంటగా థాయ్‌ లాండ్ వెళ్లి అక్కడ సేద తీరుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మీ శరత్‌కుమార్‌(Varalaxmi Sarathkumar) ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీనితో కొంతమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంత మంది మాత్రం నిశ్చితార్ధం తరువాత హానీమూన్ చేసేస్తే… పెళ్లి తరువాత ఏం చేస్తావు వరూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌… ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారు. దీనితో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లో అడుగుపెట్టిన వరలక్ష్మి(Varalaxmi Sarathkumar)… తమిళనాట చాలా మంది హీరోలతో కలిసి నటించింది. అయితే పెద్దగా కలిసి రాలేదు. దీనితో విలన్ తరహా పాత్రలు ప్రారంభించడంతో ఒక్కసారిగా సక్సెస్ అయింది. టాలీవుడ్ లో ప్రముఖ లేడీ విలన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. వరలక్ష్మీ శరత్ కుమార్… గతంలో హీరో విశాల్‌తో ప్రేమాయణం నడిపిందని… తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత కోలీవుడ్ హీరోలు ధనుష్ లేదా శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే వ్యాపారవేత్తతో మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. గత 14 ఏళ్ల నుంచి ఇద్దరికీ పరిచయముంది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది.

Also Read : Chiranjeevi : డబుల్ స్పీడ్ తో మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్

hanumanRadhika SarathkumarVaralaxmi Sarathkumar
Comments (0)
Add Comment