Vanitha Vijaykumar : వనిత 4వ పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందన ఇదే..

అయితే ఇప్పుడు ఇదంతా సినిమా స్టంట్ అని క్లియర్ గా అర్థమైంది...

Vanitha Vijaykumar : తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్(Vanitha Vijaykumar) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా విషయాల కంటే తన వ్యక్తి గత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె. ముఖ్యంగా పెళ్లి విషయాలతో వనిత పేరు తరచూ వార్తల్లో వినిపించసాగింది. ఇప్పటికే ఆమెకు మూడు సార్లు వివాహమైంది. కానీ ఎవరితోనూ బంధం నిలవలేదు.

ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి వనిత నాలుగో పెళ్లి చేసుకోనుంది అంటూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఆమె మరోసారి ఏడడుగులు వేయనుందని గుస గుసలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఒక ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది వనిత. దీనికి ‘అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి’ అని క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో దీనిని చూసిన అందరూ వనిత నాలుగు పెళ్లికి రెడీ అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. ఆమె నాలుగో పెళ్లి ప్రచారం నిజమే అనుకున్నారు.

Vanitha Vijaykumar Comment

అయితే ఇప్పుడు ఇదంతా సినిమా స్టంట్ అని క్లియర్ గా అర్థమైంది. తన లేటెస్ట్ మూవీ ‘మిసెస్ & మిస్టర్’ కోసమే ఇంతా హంగామా చేసింది వనిత(Vanitha Vijaykumar). ఇందులో ఆమెతో పాటు రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్వయంగా వనితనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. నటి కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తోంది. శనివారం (అక్టోబర్ 05) వనితా విజయ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగానే మిసెస్ అండ్ మిస్టర్ సినిమాకు సంబంధించి అప్డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు నెటిజన్లు వనితపై మండి పడుతున్నారు.

Also Read : Mrs India 2024 : మిస్సెస్ ఇండియా 2024 కిరీటాన్ని సొంతం చేసుకున్న విశాఖ యువతి

Comments (0)
Add Comment