Sandeep Reddy Shocking :నేను ఒత్తిడిని ప‌ట్టించుకోను – వంగా

ప్ర‌భాస్ ..ఎస్ఎస్ రాజ‌మౌళి అంటే రెస్పెక్ట్

Sandeep Reddy : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పాడ్ కాస్ట్ సంద‌ర్బంగా త‌న మ‌న‌సులోని భావాల‌ను షేర్ చేసుకున్నారు. త‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంటుంద‌న్నాడు. స్వంతంగా క‌థ‌ను త‌యారు చేసుకోవ‌డం, నా పాత్ర‌ల‌కు ఎవ‌రు స‌రిపోతారా అని నిరంత‌రం ఆలోచిస్తుంటాన‌ని అన్నాడు. త‌న‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేసిన వారే చివ‌ర‌కు తాను చెప్పిన పాయింట్ ను గుర్తించి, ప్ర‌శంస‌లు కురిపించ‌డం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు.

Sandeep Reddy Vanga Comments

తాను ల‌క్ ను న‌మ్ముకోన‌ని, కేవ‌లం ప‌నిని మాత్ర‌మే ప్రేమిస్తాన‌ని అన్నాడు వంగా సందీప్ రెడ్డి(Sandeep Reddy). షాహిద్ క‌పూర్ , ర‌ణ్ బీర్ క‌పూర్ లో మూవీస్ చేయ‌డం యాధృశ్చికంగా జ‌రిగింది కాద‌న్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి బిగ్ స‌క్సెస్ అయ్యింద‌ని అందుకే షాహిద్ ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు.

త‌న సినిమాలో కావాల‌ని రొమాంటిక్ సీన్స్ అంటూ ఉండ‌వ‌న్నాడు. జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌లే త‌న క‌థ‌కు మూలాల‌ని, వాటి గురించే తాను తెర‌పై తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నా చేస్తాన‌ని చెప్పాడు వంగా సందీప్ రెడ్డి. యానిమ‌ల్ మూవీ ఊహించ‌ని స‌క్సెస్ అయ్యింద‌ని, దానికి తాను గ‌ర్వ ప‌డ‌డం లేద‌న్నాడు. క‌థ బ‌లంగా ఉంటే, చెప్పే విధానం బాగుంటే మూవీ ప‌క్కా హిట్ అవుతుందన్నాడు. త‌న‌కు ప్ర‌భాస్, రాజ‌మౌళి అంటే గౌర‌వం అని చెప్పాడు. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు.

Also Read : Anurag Kashyap- Sensational Role :పోలీస్ ఆఫీస‌ర్ గా డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్

CommentsSandeep Reddy VangaViral
Comments (0)
Add Comment