Vanga Sandeep Reddy : క‌సితో ఉన్న సందీప్ రెడ్డి

యానిమ‌ల్ ఎలాగైనా స‌క్సెస్

Vanga Sandeep Reddy : ఒకే ఒక్క సినిమా అత‌డిని త‌న వైపు తిప్పుకునేలా చేసింది. పోనీ అత‌డు న‌టుడు అనుకుంటే పొర‌పాటు పాడిన‌ట్లే. జ‌స్ట్ త‌నలో ఉన్న ఫైర్ ను జ‌త చేసే ద‌మ్మున్న హీరో కోసం చూశాడు. ఇంకేం ఎవ‌రికీ త‌ట్ట‌ని కాన్సెప్ట్ తో ముందుకు వ‌చ్చాడు. త‌ను తీసిన తొలి సినిమా పేరు అర్జున్ రెడ్డి. అందులో న‌టించినోడు రౌడీ బాయ్ గా యువ‌తలో క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda).

Vanga Sandeep Reddy Coming Movies

దీనినే ఆధారంగా చేసుకుని హిందీలో షాహిద్ తో మూవీ తీశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్. దీంతో అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. ఇంకొక‌రైతే అన్నీ ఒప్పుకునే వాళ్లు. మ‌నోడు డోంట్ కేర్ అన్నాడు. త‌న‌కు తెలుసు స‌క్సెస్ ఉన్న‌ప్పుడే ప‌ల‌కిర‌స్తార‌ని. అప్పుడే గౌర‌వం, గుర్తింపు ఉంటుంద‌ని.

త‌న ఐడియాస్ కు, తాను కోరుకున్న న‌టుడి కోసం వెతికాడు బాలీవుడ్ లో. చివ‌ర‌కు ర‌ణ బీర్ క‌పూర్ దొరికాడు. ఇద్ద‌రూ కసి మీద ఉన్న‌వాళ్లే. ఇంకేం ఫ్యామిలీ సెంటిమెంట్, క్రైమ్ , రొమాన్స్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. అదే యానిమ‌ల్ మూవీ. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్స్ కెవ్వు కేక పెట్టించేలా చేశాయి. ఇక సాంగ్ లో ముద్దుల‌తో ముంచెత్తాడు. మొత్తంగా ర‌ణ బీర్ క‌పూర్ అటిట్యూడ్ ను మార్చేశాడు.

ఇంకా రిలీజ్ కాకుండా వంద‌ల కోట్లు ఆఫ‌ర్ ఇస్తున్నారట వంగా సందీప్ రెడ్డికి. ఏది ఏమైనా క‌సి ఉంటే చాలదు కాస్తంత గ‌ట్స్ కూడా ఉండాలి క‌దూ.

Also Read : Kamal Haasan : లోక‌నాయ‌కుడి మూవీకి భారీ బ‌డ్జెట్

Comments (0)
Add Comment