Vamshi Paidipally : తమిళనాడు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు తలపతి విజయ్. ఆయన దక్షిణాదిలో కీలకమైన హీరోగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వార్త సినీ రంగాన్ని హల్ చల్ చేస్తోంది. ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) దర్శకత్వంలో ఇప్పటికే వారిసు పేరుతో తమిళం, తెలుగు లో విజయ్ తో సినిమా తీశారు. దీనిని దిల్ రాజు నిర్మించారు. ఆశించిన మేర రాణించ లేదు.
Vamshi Paidipally Movie with Vijay
తాజాగా వారిసు చిత్రానికి సీక్వెల్ గా విజయ్ తో తీయనున్నట్లు సమాచారం. కానీ సీక్వెల్ తీస్తాడా లేక కొత్తగా చిత్రం తీస్తాడా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో ఫోటో కూడా షేర్ చేశారు వంశీ పైడిపల్లి.
ఇక విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సన్ ఇంటర్నేషనల్ సమర్పణలో లియో తీస్తున్నాడు. అది కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.
దీంతో విజయ్ తో మరోసారి మూవీ చేసేందుకు రెడీ అయ్యారని, వారిసు సందర్బంగా డైరెక్టర్ తో విజయ్ అనుబంధం మరింత పెరిగిందని టాలీవుడ్ లో టాక్.
వంశీ తీసే సినిమాలలో సందేశం ఉంటుంది. కుటుంబ బంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు దర్శకుడు. దీంతో ఒకవేళ విజయ్ గనుక ఓకే చెబితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరి నిర్మాత దిల్ రాజునా లేక ఇంకొకరా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : Jailer RCB Jersy : జైలర్ లో ఆర్సీబీ జెర్సీ తొలగించాలి