Vamsee Krishna: వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌ !

వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌ !

Vamsee Krishna: తొమ్మిదేండ్ల‌ క్రితం అడ‌వి శేష్, మంచు ల‌క్ష్మి ప్రధాన పాత్ర‌లో వ‌చ్చిన దొంగాట సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు వంశీ కృష్ణ. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ శిస్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు మొదటి సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్నారు. గ‌త సంవ‌త్స‌రం మాస్ మహారాజ్ ర‌వితేజ హీరోగా వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాతో మళ్ళీ మెగా ఫోన్ బాధ్యతలు పట్టి మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌(Vamsee Krishna) తాజాగా పెళ్లి పీట‌లు ఎక్కాడు. ప్రమీల అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం నాడు ఆయన వివాహం వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Vamsee Krishna Marriage

బుధవారం ఉదయం ఆయన వివాహం కొంత‌మంది ద‌గ్గ‌రి బంధుమిత్రుల స‌మ‌క్షంలో వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. ఈ వేడుక‌కు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వంశీ సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతేడాది టైగర్‌ నాగేశ్వరరావు సినిమా తీశాడు. స్టువర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించాడు. ఈ సినిమా కంటే ముందు దొంగాట మూవీని డైరెక్ట్‌ చేశాడు. ఇందులో అడివి శేష్‌, లక్ష్మీ మంచు కీలక పాత్రల్లో నటించారు.

Also Read : King Nagarjuna : నాగార్జున బర్త్ డే స్పెషల్ గా రెండు సినిమాల నుంచి స్పెషల్ ట్రీట్

Tiger Nageswara RaoVamsee Krishna
Comments (0)
Add Comment