ప్రముఖ కథా రచయిత , దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఆయన కోసం ప్రత్యేక కథను రాస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.
ఎస్ఎస్ఎంబీ29 కోసం హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇదొక ఆఫ్రికన్ అడ్వెంచర్ ఫిల్మ్ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి చేశారని టాక్.
ఇదిలా ఉండగా జక్కన్న తీసిన ప్రతి సినిమా సక్సెస్ గా నిలిచింది. ప్రభాస్ తో తీసిన ఛత్రపతి, రవితేజ తో తీసిన విక్రమార్కుడు, బాహు బళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ పాటకు.
ఇక సినిమాలకు సంబంధించి స్క్రీన్ ప్లే ముఖ్యమైతే దానికి స్క్రిప్టు అత్యంత ప్రధానం. అందుకే మహేష్ సినిమాకు మనసు పెట్టి విజయేంద్ర ప్రసాద్ రాసినట్లు సమాచారం. ఇప్పటి దాకా ఈగ, బజరంగీ భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్ కు కథలు అందించారు.
ఈ మూవీ మొత్తం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని రివీల్ చేశారు విజయేంద్ర ప్రసాద్. మహేష్ బాబు ఏ పాత్ర లోనైనా ఒదిగి పోయే అద్భుతమైన నటుడు అని ప్రశంసించారు. ఇదే సమయంలో ఆయనకు తగ్గట్టు కథ రాశానని చెప్పారు.