Ustaad Bhagat Singh : టాలీవుడ్ లో దమ్మున్నోడు హరీశ్ శంకర్. ఆయన టేకింగ్, డైలాగులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఒక రకంగా పవర్ స్టార్ స్టామినాను నిలబెట్టేలా చేసింది. ప్రత్యేకించి క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుంది.
Ustaad Bhagat Singh Updates
వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రం వస్తోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీస్తున్నాడు హరీశ్ శంకర్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన నటిగా ముందుగా ముంబైకి చెందిన పూజా హెగ్డేను అనుకున్నారు.కానీ ఎందుకనో ఆమెను కాకుండా లవ్లీ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారు దర్శకుడు. ఆమెను ఎంపిక చేసి తీసేశారు తాజాగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న గంటూరు కారం.
దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ పవన్ కళ్యాణ్ షూటింగ్ తో మొదలు పెట్టాడు దర్శకుడు హరీశ్ శంకర్.
Also Read : Jailer Movie : తమిళ నాట జైలర్ జైత్రయాత్ర