Ustaad Bhagat Singh : చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ‘పుష్ప-2’ను ఉద్దేశించినవి కాదని రవిశంకర్ వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన అమరావతిలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ‘‘ ఇటీవలే పవన్ కల్యాణ్‌ను కలిశాను. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagat Singh)’ షూటింగ్‌ను ప్రారంభించనున్నాం. డిసెంబర్, జనవరి నాటికి చిత్రీకరణను పూర్తిచేయాలని ప్లాన్ చేసుకున్నాం. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా మా టీమ్ నుంచి సర్‌ప్రైజ్ కచ్చితంగా ఉంటుంది’’ అని చెప్పారు.
Ustaad Bhagat Singh Movie Updates
చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ‘పుష్ప2’ను ఉద్దేశించినవి కాదని ఆయన చెప్పారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పారు. ‘ పుష్ప-2’ సినిమా డిసెంబరు 6న కచ్చితంగా విడుదలవుతుందన్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రం అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఎన్టీఆర్ డిసెంబర్ నుంచి ఆ చిత్రీకరణలో పాల్గొంటారని తెలిపారు. ‘ గబ్బర్‌సింగ్’ వచ్చిన 12 ఏళ్ల తర్వాత పవన్‌కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం రానుంది. శ్రీలీల కథానాయిక. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు విశేష ఆదరణ లభించింది. అలాగే ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్‌ల సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే జరిగీంది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : Animal Sequel : ‘యానిమల్’ సీక్వెల్ రిలీజ్ కు మరో 4 ఏళ్ళు పట్టనుందా ..?