Beauty Urvashi Rautela :ఊర్వ‌శి రౌతేలా సంచ‌ల‌నం అభిమాన పుర‌స్కారం

అభిమానుల అభిమాన క‌ళాకారిణి-2025 అవార్డు

Urvashi Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా సంచ‌ల‌నంగా మారింది. త‌న‌కు అరుదైన పుర‌స్కారం ల‌భించింది. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా సామాజిక వేదిక‌గా పంచుకుంది. ఈ సంద‌ర్బంగా త‌న‌ను అభిమానించే ప్ర‌తి ఒక్క‌రికీ దీనిని అంకితం ఇస్తున్న‌ట్లు తెలిపింది. 2025 ఏడాదిలో ఫ్యాన్స్ అభిమాన క‌ళాకారిణిగా ఎంపికైంది. దాస్ కా ధ‌మ్కీ పాట‌కు గాను ఇది ద‌క్కింది. ఇక ఊర్వ‌శి రౌతేలా(Urvashi Rautela) ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కార‌ణం ఈ ఏడాది సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా విడుద‌లైన డాకు మ‌హారాజ్ లో న‌టించింది.

Urvashi Rautela..

ఇందులో నంద‌మూరి న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ లో రెచ్చి పోయింది. ద‌బిడి దిబిడి పాట‌కు ఇద్ద‌రూ క‌లిసి డ్యాన్స్ చేసినా దీనిపై, చిత్రీక‌ర‌ణ‌పై, కొరియోగ్రాఫ‌ర్ పై పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ పాట‌లో ఎమ్మెల్యేగా ఉన్న బాల‌కృష్ణ ఆమె న‌డుముపై కొట్ట‌డం, చ‌ర్చ‌డం , రౌతేలా హావ భావాలు ప‌లికించ‌డం పూర్తిగా వివాదానికి దారి తీసింది. ఈ సినిమాకు బాబ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సూప‌ర్ హిట్ టాక్ అందుకుంది. రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది.

అన్నింటిని ప‌క్క‌న పెడుతూ అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన పాట‌గా, న‌టిగా గుర్తింపు పొందారు ఊర్వ‌శి రౌతేలా. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ క్వీన్ అవార్డు ద‌క్కింది. దీంతో అంతులేని ఆనందానికి లోనైంది ఈ ముద్దుగుమ్మ‌. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ఈ గుర్తింపు రావ‌డం మీ వ‌ల్లే అంటూ ఫ్యాన్స్ కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఈ అవార్డుతో త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని భావిస్తోంది.

Also Read : Beauty Samantha-Atlee :అట్లీ పాన్ ఇండియా మూవీలో స‌మంత..?

UpdatesUrvashi RautelaViral
Comments (0)
Add Comment