Urvashi Rautela : ఎవరీ డైమండ్ దీదీ అనుకుంటున్నారా. టాలీవుడ్ లో నందమూరి నట సింహం నందమూరి బాలయ్యతో దబిడి దిబిడి అంటూ స్టెప్పులు వేస్తూ కుర్రకారును కైపెక్కించేలా చేసింది. ఈ మూవీ విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్ పై పెద్ద ఎత్తున ట్రోల్ జరిగింది. అత్యంత జుగుస్సాకరంగా , ఎబ్బెట్టుగా ఉందంటూ విమర్శలు కూడా వచ్చాయి.
Urvashi Rautela Movie Updates
అయినా నిర్మాత, దర్శకుడు వాటి గురించి పట్టించు కోలేదు. చివరకు సంక్రాంతి పండుగ సందర్బంగా డాకు మహారాజ్ మూవీ రిలీజ్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు టాక్.
ఇదే సినిమాతో పాటు రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ ఛేంజర్ , అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా విడుదలయ్యాయి. గ్లోబల్ స్టార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వెంకీ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. చరిత్ర సృష్టించింది. మరో వైపు డాకు మహారాజ్ సూపర్ హిట్ కావడంతో ఇందులో ఒకే ఒక్క పాటలో నటించిన ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) సెన్సేషన్ గా మారింది.
సోషల్ మీడియాలో ఆమె గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి గుప్పుమంటోంది. అదేమిటంటే ఈ మూవీలో నటించేందుకు ఊర్వశి రౌతేలా ఏకంగా రూ. 3 కోట్లు వసూలు చేసిందని టాక్. వామ్మో ఊర్వశినా మజాకా అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Hero Balayya- Akhanda 2 :శరవేగంగా అఖండ2 మూవీ షూటింగ్