నటి ఊర్వశి రౌటేలా గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంది సినిమాలలో. తాజాగా సదరు నటి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోయిన్ పాత్రల కంటే కేవలం ఐటం సాంగ్స్ చేయడం బెటర్ అంటోంది ఊర్వశి రౌటేలా.
ఎవరిని ఉద్దరించేందుకు ఈ హీరోయిన్ పాత్రలు అంటూ ప్రశ్నించింది. ఆయా సినిమాలలో చేయాలంటే సమయం ఎక్కువ పడుతుందని , అదే ఐటం సాంగ్ అయితే సులభంగా ఉంటుందని పేర్కొంది ఊర్వశి రౌటేలా.
విచిత్రం ఏమిటంటే ఎవరైనా సినిమాలలో హీరోయిన్ ఛాన్స్ కోసం నానా తంటాలు పడుతుంటారు. కానీ ఊర్వశి మాత్రం ఆ పాత్రలంటే ససేమిరా వద్దంటోంది. తనకు ఐటం సాంగ్స్ మాత్రమే కావాలని మారాము చేస్తోంది.
ఈ మధ్యన సినీ రంగంలో పెను మార్పులు కూడా వచ్చాయి. ఆ మధ్యన సూపర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత రుత్ ప్రభు. తను కూడా తాజాగా బన్నీ , రష్మిక మంధన్నా కలిసి నటించిన పుష్ప ది రైజ్ మూవీలో ఊ అంటావా మావా అనే ఐటం సాంగ్ లో నటించింది. దేశ వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారి పోయింది. సో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలని డిసైడ్ అయ్యింది రౌటేలా.