Urvashi Rautela : బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలై బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్బంగా ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ప్రత్యేకించి ఈ సినిమాలోని దబిది దిబిడి పాట సంచలనంగా మారింది . ఈ చిత్రం ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు సాధించింది.
Urvashi Rautela Song..
బాలయ్య సినీ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే దర్శకుడు బాబీ గతంలో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య మూవీ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ . ఆ తర్వాత వచ్చిన మూవీ కావడంతో ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా నందమూరి నట సింహం విశ్వ రూపాన్ని ప్రదర్శించేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.
అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది స్పెషల్ సాంగ్. దీనిని బాలీవుడ్ యాక్టర్ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) తో బాలయ్య బాబు నటించాడు. చార్ట్స్ లో టాప్ లో నిలిచింది ఈ సాంగ్. ఇదే సమయంలో ఈ పాట పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ఒక పరిణతి చెందిన నటుడు, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉన్న బాలకృష్ణ మరీ ఓవర్ గా నటించాడని, నటికి గుర్తింపు లేకుండా పోయిందని, పూర్తిగా వల్గర్ గా ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నెగటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి.
అయినా సినిమా ఎక్కడా ఆగలేదు. బాక్సులు కాసులతో నిండి పోయాయి. ఈ సందర్బంగా తాజాగా నటి ఊర్వశి రౌతేలా స్పందించింది. ఇది పూర్తిగా బాలయ్య అభిమానుల కోసం రూపొందించారంటూ పేర్కొంది. ఇందులో ఎలాంటి వల్గర్ అన్నది లేదని, దానిని చూసే వారి దృష్టిని బట్టి ఉంటుందని చెప్పింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Hero Vishnu Kannappa :కన్నప్ప శివ శివ శంకర సాంగ్ రిలీజ్