Urvashi Rautela : నటసింహ బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

ఇక ఈ భామ 15 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది...

Urvashi Rautela : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. హిందీలో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అందాల భామ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). తన అందంతో ఈ అమ్మడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ భామ తన నటనతో పాటు అందచందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ వయ్యారి పరిచయమే.. స్పెషల్ సాంగ్స్ లో మెప్పించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఊర్వశీ రౌతేలా.

ఇక ఈ భామ 15 సంవత్సరాల వయస్సులో తన మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది. గతంలో మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది ఊర్వశి(Urvashi Rautela). 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఊర్వశి .. తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాతో పరిచయం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెప్పించింది. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ లో చిరుతో స్టెప్పులేసింది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్, అలాగే సాయి ధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అలాగే బోయపాటి రామ్ కాంబోలో వచ్చిన స్కంద సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది.

Urvashi Rautela Appreciates..

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు నటసింహ బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఊర్వశీ రౌతేలా నటిస్తుంది. తాజాగా ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ బాలయ్య గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. బాలకృష్ణ చాలా పెద్ద యాక్టర్, ఆయన లెజెండరీ యాక్టర్. పనిపట్ల చాలా శ్రద్ద ఉన్న మనిషి బాలయ్య. ఆయన ఇతరులను చాలా గౌరవిస్తారు. ముఖ్యంగా మహిళలకు చాలా గౌరవం ఇస్తారు. ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది ఊర్వశీ రౌతేలా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య పై ఊర్వశి ప్రశంసలు కురిపించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read : Prakash Raj : గుడికి వెళ్లిన ప్రకాష్ రాజ్ పై భగ్గుమన్న అభిమానులు

CommentsUrvashi RautelaViral
Comments (0)
Add Comment