Urvashi Rautela : బాలయ్య ‘నాకు మహారాజ్’ కు భారీ రెమ్యునరేషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

అలాగే బాలయ్యతో ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు...

Urvashi Rautela : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నయా మూవీ డాకూ మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకూ మహారాజ్(Daaku Maharaj) థియేటర్స్ లో సందడి చేయనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. డాకూ మహారాజ్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ అందరి దృష్టి ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలకృష్ణ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు.

Urvashi Rautela…

డాకూ మహారాజ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైస్వాల్ లతో పాటు బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) కూడా నటిస్తుంది . ఊర్వశి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ. అలాగే తెలుగులో ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని తెలుస్తుంది. డాకూ మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫిసర్ గా కనిపించనుందని తెలుస్తుంది.

అలాగే బాలయ్యతో ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం ఊర్వశి తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఊర్వశి, చిరంజీకి హీరోగా నటించిన ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఉర్వశికి తన సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఇచ్చాడు బాబీ. కాగా బాలయ్య బాబు సినిమాలో నటించినందుకు ఊర్వశి ఏకంగా రెండున్నర కోట్లు రూపాయిలు రెమ్యునరేషన్ అందుకుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే దబిడి దిబిడి సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

Also Read : Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు

Daaku MaharaajRemunerationTrendingUpdatesUrvashi RautelaViral
Comments (0)
Add Comment