Urvashi Rautela: పెళ్లిపై ఊర్వశి రౌతేలా కీలక వ్యాఖ్యలు !

పెళ్లిపై ఊర్వశి రౌతేలా కీలక వ్యాఖ్యలు !

Urvashi Rautela: “వేర్ ఈజ్ ద పార్టీ… బాసూ వేర్ ఈజ్ ద పార్టీ” అంటూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసి టాలీవుడ్ ఐటెం గర్ల్ గా గుర్తింపు పొందిన నటి ఊర్వశి రౌతేలా. ఆ తరువాత రామ్‌ ‘స్కంద’, అఖిల్‌ ‘ఏజెంట్‌’, పవన్ కళ్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’ సినిమాల్లో తన మాస్ అండ్ క్లాస్ డాన్స్‌ తో ఐటెం సాంగ్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నారు. మత్తెక్కించే అందం, మైమరపించే డ్యాన్స్ తో మలైక అరోరా తరహాలో అభిమానులను సంపాదించుకున్న ఊర్వశీ రౌతేలా… ఇప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో ఆఫర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఈమె బాలకృష్ణ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ విలన్ గా బాబీ దర్శకత్వంలో ‘#Nbk109’ వర్కింగ్‌ టైటిల్‌ తో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పెళ్ళి గురించి ఈ ఐటెం గర్ల్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Urvashi Rautela Comment

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) మాట్లాడుతూ… ‘‘ ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. అది ఇరువైపులా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు పూర్తి అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టాలి. ఎదుటి వ్యక్తిపై నమ్మకం, గౌరవం ఎంతో ముఖ్యం. వివాహ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో జీవితాంతం కలిసి నడుస్తూ బాధ్యతలు నిర్వర్తించాలి’’అని పేర్కొన్నారు. సీనీ పరిశ్రమలోకి రాకుండా ఉంటే జిమ్నాస్ట్‌, ఏరోనాటికల్‌ ఇంజినీర్‌, లేదా ఐఏఎస్‌ అధికారినో అయ్యేదానినని ఊర్వశీ రౌతేలా అన్నారు. అయితే ఐటెం సాంగ్స్ తో బిజీగా ఉన్న ఊర్వశీ రౌతేలా పెళ్ళిపై ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read : Ari Movie: విడుదల కాకముందే రీమేక్ కోసం పోటీపడుతున్న సినిమా ?

Urvashi Rautelawaltair veerayya
Comments (0)
Add Comment