Urvashi Rautela: పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్ కేక్ కట్ చేసిన సెక్సీ డాల్ !

పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్ కేక్ కట్ చేసిన సెక్సీ డాల్ !

Urvashi Rautela: “వేర్ ఈజ్ ద పార్టీ… బాసూ వేర్ ఈజ్ ద పార్టీ” అంటూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసి… టాలీవుడ్ ఐటెం గర్ల్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. మత్తెక్కించే అందం, మైమరపించే డ్యాన్స్ తో టాలీవుడ్ లో కూడా ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న ఊర్వశీ రౌతేలా… ఏం చేసినా స్పెషల్. ప్రతీ ఏటా తన పుట్టిన రోజును గ్రాండ్ గా చేసుకునే ఈ ఐటమ్ బ్యూటీ… ఈ సారి వెరీ స్పెషల్ గా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఆదివారం (ఫిబ్రవరి 25) న తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని బంగారపు కేక్ ను కట్ చేసి వార్తల్లో నిలిచింది. తన స్నేహితులతో కలిసి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన కేక్ కట్ చేసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పుట్టినరోజు వేడుకల్లో ఊర్వశి… కట్ చేసిన గోల్డ్ కేక్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Urvashi Rautela Birthday Celebrations

ప్రతీఏటా తన పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకునే ఈ ఐటెం గర్ల్… ఈ ఏడాది గోల్డ్ కేక్ కట్ చేయడంపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెక్సీ బ్యూటీ కాస్తా గోల్డ్ బ్యూటీగా మారింది… గోల్డ్ బ్యూటీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం తినే కేక్‌పై బంగారు కోటింగ్ అవసరమా… ? ఇది మరీ ఓవరాక్షన్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

అయితే ఊర్వశి(Urvashi Rautela) మాత్రం… ఈ కామెంట్లను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన ఊర్వశి… రామ్‌ ‘స్కంద’, అఖిల్‌ ‘ఏజెంట్‌’, పవన్ కళ్యాణ్‌, సాయి తేజ్‌ల ‘బ్రో’ సినిమాల్లో తన మాస్ అండ్ క్లాస్ డాన్స్‌ తో ఐటెం సాంగ్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో వేర్ ఈజ్ ద పార్టీ పాట తరువాత… ఈ బ్యూటీ టాలీవుడ్ లో అనేక ఆఫర్లను అందుకుంటోంది.

Also Read : V Mahesh : స్వర్గస్తులైన టాలీవుడ్ నిర్మాత, రచయిత “వి మహేష్”

Urvashi Rautelawaltair veerayya
Comments (0)
Add Comment